డిసెంబరులోగా బొగ్గు ఉత్పత్తి షురూ
ABN , Publish Date - Sep 07 , 2026 | 02:34 AM
ప్రభుత్వ రంగంలో ని ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎండీసీ బొగ్గు ఉత్పత్తిలోకి ప్రవేశిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో ని ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎండీసీ బొగ్గు ఉత్పత్తిలోకి ప్రవేశిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు కల్లా ఝార్ఖండ్‌లోని టోకిసూద్ నార్త్ కోల్ గని నుంచి ఽథర్మల్ కోల్ (థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఉపయోగించే బొగ్గు) ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ చైర్మన్, ఎండీ అమితవ్ ముఖర్జీ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ గని నుంచి ఉత్పత్తి చేసే థర్మల్ కోల్‌లో 10 లక్షల టన్నుల బొగ్గును వివిధ విద్యుత్ కేంద్రాలకు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖర్జీ చెప్పారు.