ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:31 AM
తెలంగాణ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా... వచ్చే ఏడాది జూన్ 27 నుంచి గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
బాసరలో 374 కోట్ల పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన
బాసర, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా... వచ్చే ఏడాది జూన్ 27 నుంచి గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బాసర పుణ్యక్షేత్రంలో పర్యటించిన ఆయన రూ. 354 కోట్లతో చేపట్టిన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు, రూ.20కోట్లతో నిర్మించనున్న పుష్కర ఘాట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యం, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమన్నారు. పెరగనున్న రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్లను విస్తరిస్తున్నామని, మహిళలకు ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, నిరంతర పారిశుధ్య నిర్వహణ, 24 గంటల ఉచిత వైద్యసేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. బాసరతో పాటు నదీ తీరంలోని 12 ప్రాంతాల్లో రూ. 1000 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాదిన్నర ముందే పనులు ప్రారంభించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబరులోగా బొగ్గు ఉత్పత్తి షురూ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News