Share News

శీతల్‌కు టాప్‌ సీడ్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:36 AM

భారత పురుషులు, మహిళల కాంపౌండ్‌ జట్లు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో టాప్‌ సీడింగ్‌ దక్కించుకొన్నాయి. మహిళల వ్యక్తిగత విభాగం అర్హత రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సాధించిన శీతల్‌ దేవితోపాటు లాల్‌పాటి, సరిత, పాయల్‌ నాగ్‌ నేరుగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

శీతల్‌కు టాప్‌ సీడ్‌

  • సెమీస్‌కు యుగళ్‌, పవన్‌, తన్వీ

  • వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌

అహ్మదాబాద్‌: భారత పురుషులు, మహిళల కాంపౌండ్‌ జట్లు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో టాప్‌ సీడింగ్‌ దక్కించుకొన్నాయి. మహిళల వ్యక్తిగత విభాగం అర్హత రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సాధించిన శీతల్‌ దేవితోపాటు లాల్‌పాటి, సరిత, పాయల్‌ నాగ్‌ నేరుగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో శీతల్‌, లాల్‌పాటి, సరితల త్రయం 1368 పాయింట్లతో టాప్‌లో నిలిచి నేరుగా సెమీస్‌కు అర్హత సాధించింది. పురుషుల కాంపౌండ్‌ విభాగంలో రాకేష్‌, తోమన్‌, గుర్వీందర్‌, శ్యామ్‌ సుందర్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగం క్వాలిఫికేషన్‌లో టాప్‌లో నిలిచిన భారత జట్టు నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో శీతల్‌, రాకేష్‌ జంట వరల్డ్‌ రికార్డు స్కోరు 1400 పాయింట్లతో టాప్‌ సీడ్‌ సాధించారు. ఈ క్రమంలో గతంలో నెలకొల్పిన 1399 పాయింట్ల తమ రికార్డును తామే అధిగమించారు. అంధుల విభాగంలో తన్వీ సెమీస్‌ చేరగా.. క్వార్టర్స్‌లో పవన్‌ కుమార్‌ 6-0తో గోవర్ధన్‌పై, యుగళ్‌ 6-0తో అర్ణవ్‌ బైస్‌పై గెలిచారు.

ఈ వార్తలను కూడా చదవండి

ధారకొండ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Updated Date - Sep 07 , 2026 | 01:36 AM