వ్యక్తిగత విమర్శలు సరికాదు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:29 PM
గత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం చేతకాని నాయకులు, నేడు అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీద నాలుగైదు రోజులుగా పోలాకి జడ్పీటీసీ కృష్ణచైతన్య తదితరులు వివిద సామాజిక మాద్యమాల్లో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైన పద్ధతికాదని నరసన్నపేట నియోజవర్గం టీడీపీ నాయకులు హెచ్చరించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం చేతకాని నాయకులు, నేడు అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీద నాలుగైదు రోజులుగా పోలాకి జడ్పీటీసీ కృష్ణచైతన్య తదితరులు వివిద సామాజిక మాద్యమాల్లో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైన పద్ధతికాదని నరసన్నపేట నియోజవర్గం టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలాకి మండలంలో అభివృద్ధి పనుల విషయంపై చట్టాన్ని తన చేతిలో తీసుకొని పోలాకి ఎంపీడీవో కార్యాలయంపై దాడికి పాల్పడడం, ఎంపీడీవోపై వ్యక్తిగత దాడికి పాల్పడి అధికారులను బెదిరింపులకు గురిచేయడం తీవ్ర పరిణామమని తెలిపారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై దాడికి పాల్పడడమే కాకుండా పోలాకి జెడ్పీటీసీ జులం ప్రదర్శించడం సరికాదని, వైసీపీ నాయకులు స్థాయి మరిచి విమర్శలు చేయడంపై ఖండించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మిరియపల్లి వెంకటప్పలనాయుడు, బైరి భాస్కరరావు, దుంగస్వామిబాబు, అడపా చంద్రశేఖర్, దామోదర నర్సింహాలు, జామి వెంకట్రావు, వెలమల రాజేంద్ర, కొంక్యాన బాబ్జీ, గొద్దు చిట్టిబాబు, బలగ ప్రహర్ష, బలగ భారతి, బగ్గు గోవిందరావు, గొలివి రామారావు పాల్గొన్నారు.