Share News

స్వర్ణరథంపై ఆది దంపతులు

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:44 PM

శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదిన ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.

స్వర్ణరథంపై ఆది దంపతులు
స్వర్ణ రథంపై పూజలందుకుంటున్న స్వామి, అమ్మవార్లు

శ్రీశైలం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదిన ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతోపాటు విశేష పూజలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకీలో వచ్చిన ఆదిదంపతులకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి స్వర్ణ రథంపై ఆశీనుల చేశారు. గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవ ప్రారంభంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించిన వేదపండితులు దేశంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:44 PM