పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:27 PM
:పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉర్లాం పీహెచ్‌సీ వైద్యురాలు మెండ శాలిని సూచించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి):పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉర్లాం పీహెచ్‌సీ వైద్యురాలు మెండ శాలిని సూచించారు. ఆదివారం మండలంలోని దేవాదిలో విషజ్వరాలు విజృంభించడంతో శాలిని ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటా రక్త నమునాలను సేకరించారు. గ్రామంలో ఇటీవల జ్వరాలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇబ్బందిపడుతున్న నేపధ్యంలో వైద్యులు, సిబ్బంది శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు తాగునీరు కాచిచల్లార్చి తాగాలని సూచించారు. కార్యక్రమంలో గణపతి, వైద్యఆరోగ్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.