తెలంగాణలో కొత్త మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లు అందుబాటులోకి..
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:23 PM
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం సీసాల పరిమాణాలకు అదనంగా కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం సీసాల పరిమాణాలకు అదనంగా కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ పాత నిబంధనలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో 90ml, 180ml, 375ml, 750ml పరిమాణాల్లో మద్యం బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటితో పాటు కొత్తగా 150ml, 200ml పరిమాణాల్లో మద్యం సీసాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే, కొత్త సీసాల పరిమాణాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మద్యం ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మద్యం మార్కెట్లో కొత్త మార్పులకు దారితీయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News