Share News

హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం: సీఎస్ సంజయ్ జాజు

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:14 PM

నవంబర్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటినే వాడాలని సూచించారు.

హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం: సీఎస్ సంజయ్ జాజు
Telangana CS Sanjay Jaju

హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నవంబర్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) ప్రకటించారు. తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటినే వాడాలని సూచించారు. ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.


గ్రీన్ ట్యాంకర్ల బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్..

STP నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. శుద్ధి చేసిన నీటి సరఫరాపై రోజువారీ నివేదిక ఇవ్వాలని HMWSSB ఎండీని ఆదేశించారు. మిషన్ భగీరథ అదనపు 40 MGD నీటి పథకం నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. విలీనమైన పట్టణ స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు బల్క్ వాటర్‌ను సరఫరా చేయాలని సూచించారు. గ్రీన్ ట్యాంకర్ల ద్వారా డిమాండ్ మేరకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రీన్ ట్యాంకర్ల బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించడమే సేవ్ వాటర్ క్యాంపెయిన్ లక్ష్యమని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 09:23 PM