నీట్ పరీక్ష భద్రతపై ప్రత్యేక దృష్టి.. సీఎస్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:46 PM
జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Telangana CS RamakrishnaRao) ఈరోజు(శనివారం) సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 208 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24 నగరాల్లో 72,956 మంది విద్యార్థులు నీట్‌కు హాజరు కానున్నారని చెప్పుకొచ్చారు.
పరీక్షా కేంద్రాల్లో భద్రత, విద్యుత్, తాగునీరు, రవాణా ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల రవాణాకు తొలిసారిగా భారత వైమానిక దళం సేవలు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షల భద్రతకు ఈసారి ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేస్తున్నామని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News