Share News

100 ఎమ్మెల్యే సీట్లే మా టార్గెట్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:07 AM

వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ నియోజకవర్గాలో గెలుపే తమ టార్గెట్‌ అని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ వెల్లడించారు.

100 ఎమ్మెల్యే సీట్లే మా టార్గెట్‌
Mahesh Kumar Goud

  • రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్సే

  • కేటీఆర్‌, హరీశ్‌ భ్రమల్లో ఉన్నారు: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ నియోజకవర్గాలో గెలుపే తమ టార్గెట్‌ అని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావులు ఇంకా భ్రమల్లోనే ఉన్నారని, క్షేత్రస్థాయులో ఉన్న వాస్తవాలను వారు తెలుసుకోవట్లేదన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారని, తమకు ఉన్నంత సమన్వయం దేశంలో ఎక్కడా లేదన్నారు.


క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, పార్టీ ఎమ్మెల్యేలు చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా మళ్లీ గెలవబోరన్నారు. కేసీఆర్‌ మేధావి అని అనుకుంటారని, కానీ ఆయన ఆలోచన లేకుండా అప్పులు చేశారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, కానీ హరీశ్‌రావు పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను మీడియాలో చూశానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

365 మండలాల్లో కరువు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:09 AM