పంటకు మురుగు నీరే దిక్కాయె!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:31 AM
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు జాడలేవు! భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు చుక్కనీరు పోయడం లేదు. మరి ఎలా? ఈ పరిస్థితి గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీ పరిధిలోని తుపతురాల గ్రామంలోని మిర్చి రైతులకూ ఎదురైంది.
ట్యాంకర్లలో నింపుకొని మిర్చి పంటకు
అయిజ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు జాడలేవు! భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు చుక్కనీరు పోయడం లేదు. మరి ఎలా? ఈ పరిస్థితి గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీ పరిధిలోని తుపతురాల గ్రామంలోని మిర్చి రైతులకూ ఎదురైంది. చెరువులు, వాగులు ఎండిపోవడంతో పంటను ఎలాగైనా రక్షించుకునేందుకు వారి చూపు మురుగునీరు వైపు మళ్లింది. అయిజ పెద్దవాగులో మురుగునీరు పారుతోంది.
ఆ నీటిని ట్యాంకర్లలో నింపుకొని మిర్చి పంటను తడుపుతున్నారు. ఓ 20 మంది రైతులు కలిసి ట్యాంకర్లను మాట్లాడుకుంటున్నారు. ట్యాంకర్‌కు నెలకు రూ.50వేల చొప్పున చెల్లిస్తున్నారు. కాగా తాను ఐదెకరాల్లో మిర్చి పంట వేశానని, ఇప్పటికే ఎకరాకు రూ. 60 వేల చొప్పున పెట్టుబడి పెట్టానని తుపతురాల గ్రామానికి చెందిన రైతు బాలు చెప్పాడు. నీళ్లు లేక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని.. ఈ దశలో ఖర్చుకు భయపడితే ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడంతా పోతుందని.. అందుకే ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నానని చెప్పాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల అమలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News