Share News

బాబోయ్‌.. చలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:17 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియ్‌సగా ఉండగా... గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యింది.

బాబోయ్‌.. చలి
Winter Telangana Weather

  • కోహీర్‌లో 11 డిగ్రీలు హైదరాబాద్‌లో 18.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు

కోహీర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియ్‌సగా ఉండగా... గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతోంది.


ఈ సీజన్‌లోనే అత్యల్పంగా శనివారం ఉదయం కోహీర్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కంగ్టి ప్రాంతాల్లోనూ చలి తీవ్రత కనిపిస్తోంది. శనివారం ఉదయం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో కోహీర్‌ 11, సత్వార్‌ 11.7, అల్గోల్‌ 11.9, మల్చెల్మ 12.4, కంగ్టి 12.6, మొగుడంపల్లి 12.7, న్యాల్‌కల్‌ 13, జహీరాబాద్‌ 14.1, ఝరాసంగం 14.7, నారాయణఖేడ్‌ 15.1, సంగారెడ్డి 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌ జిల్లాలోనే అత్యల్పంగా చిట్కుల్‌లో 12.8 డిగ్రీలు, లింగాయిపల్లిలో 13.2, నాగాపూర్‌లో 13.3, బుజరంపేట్‌ 13.5, పాతూర్‌ 13.5, కౌడిపల్లి 13.5, టేక్మాల్‌ 14, మెదక్‌ 15.5, నర్సాపూర్‌లలో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని నంగునూర్‌లో 12.5, మునిగడప 12.7, కొండపాక, కొడకండ్ల 12.8, హబ్షీపూర్‌ 12.8, అంగడి కిష్టాపూర్‌ 13, గజ్వేల్‌ 14.1, హుస్నాబాద్‌లో 14.9, సిద్దిపేటలో 16.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 04:17 AM