Share News

పెరిగిన చలి తీవ్రత

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:44 AM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్‌ సిటీ, ఆసిఫాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌(యు)లో 11.1, కెరమెరిలో 11.3, వాంకిడిలో 12.4, సిర్పూర్‌(టి)లో 12.5, కౌటాలలో 13.3, బెజ్జూరు, కాగజ్‌నగర్‌లలో 13.7, రెబ్బెనలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. కాగా గ్రేటర్‌లో రెండు రోజులుగా చలితీవ్రత పెరిగింది. రాత్రి వేళల్లో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో రాజధాని నగరవాసులు వణికిపోతున్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు చలిగాలులు తీవ్రత కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 04:44 AM