Share News

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ భేటీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:39 PM

దావోస్‌ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ భేటీ
TG CM Revanth Reddy meets WEF MD jeremy Jorgens

హైదరాబాద్ / దావోస్, జనవరి 22: వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ఎండీ జెరెమీ జార్గాన్స్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గురువారం దావోస్‌లో వరల్డ్ ఎనకామిక్ ఫోరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో వీరి కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు ఏర్పాటును సీఎం రేవంత్ ప్రతిపాదించారు. ఏటా జులైలో నిర్వహించే ఈ ఫాలోఅప్ ఫోరం కార్యక్రమంపై ఇరువురూ చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ఎండీకి ముఖ్యమంత్రి వివరించారు.


అలాగే.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంపై రోడ్‌ మ్యాప్‌ను కూడావీరు ప్రస్తావించారు. తెలంగాణ విజన్‌కు భాగస్వామ్యంగా నిలుస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎండీ జెరెమీ జార్గాన్స్‌ హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్‌లో ప్రభావవంతమైన మానవ వనరులపై ప్రశంసలు జల్లు కురిపించారు జార్గాన్స్. C4IR తెలంగాణ పురోగతిపై డబ్ల్యూఈఎఫ్ ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో తొలి థీమాటిక్ C4IRగా తెలంగాణకు గుర్తింపు వచ్చినట్లు అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?

వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?

For More TG News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 02:15 PM