ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:19 PM
ఇటీవల చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి శునకం దాడి చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్: సూరారం(Suraram) పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క(stray dog) దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడి ఘటనా సంబంధిత దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో.. బాలుడు నడుచుకుంటూ వస్తుండగా.. అటుగా వచ్చిన ఓ శునకం అకస్మాత్తుగా దాడి చేసింది. భయంతో ఆ బాలుడు బిగ్గరగా కేకలు వేయగా.. స్థానికులు అక్కడకు చేరుకుని ఆ కుక్కను తరిమికొట్టారు. అప్పటికే బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సూరారం ప్రాంతవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వీధుల్లో కుక్కల సమస్య ఉందని, ఒంటరిగా పిల్లలు బయటకు వెళితే కుక్కలు దాడులు చేస్తున్నాయన్నారు. పిల్లలే కాదు.. పెద్దలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి గాజుల రామారం సర్కిల్ అధికారులకు గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..
ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!