Share News

దీపక్ ఆత్మహత్య కేసు.. షిమ్జితా అరెస్ట్

ABN , Publish Date - Jan 21 , 2026 | 07:07 PM

దీపక్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైందని పేర్కొంటూ షిమ్జితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమెను అరెస్ట్ చేశారు.

దీపక్ ఆత్మహత్య కేసు.. షిమ్జితా అరెస్ట్
social media influencer Shimjitha Musthafa

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దీపక్ ఆత్మహత్యకు కారణమైన 35 ఏళ్ల షిమ్జితా ముస్తఫాను అరెస్ట్ చేశారు. దీపక్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైందని పేర్కొంటూ షిమ్జితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమెను అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దీపక్ మరణంపై దర్యాప్తునకు ఆదేశించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు స్పష్టం చేసింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

కొద్దిరోజుల క్రితం షిమ్జితా ముస్తఫా, దీపక్ బస్సులో ప్రయాణిస్తున్నారు. దీపక్ తనను ఉద్ధేశ్యపూర్వకంగా తాకుతున్నాడని ఆరోపిస్తూ షిమ్జితా ఓ వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. 20 లక్షల మందికిపైగా ఆ వీడియోను చూశారు. దీపక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి దీపక్ కుమిలిపోయాడు. అవమానాన్ని భరించలేక కోజికోడ్‌లోని తన ఇంట్లో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.


దీపక్ మరణంపై అతడి తల్లి మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఇప్పటి వరకు అతడు ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. రెండు రోజులు అసలు అన్నమే తినలేదు. ఆఖరికి శనివారం కూడా అన్నం తినలేదు. ఆ రోజు అతడి పుట్టిన రోజు’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక, దీపక్ ఆత్మహత్య చేసుకోవటంతో షిమ్జితా ఆ వీడియోను డిలీట్ చేసింది. తనను తాను సమర్ధించుకుంటూ మరో వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను కూడా తర్వాత ప్రైవేట్‌లో పెట్టింది. సోమవారం ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Updated Date - Jan 22 , 2026 | 07:43 AM