Share News

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jan 21 , 2026 | 06:06 PM

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త వసంతరాయలు కుటుంబాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. కుటుంబసభ్యులు వసంతరాయలు అవయవాలను దానం చేసి ఐదుగురికి కొత్త జీవితం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Pawan Kalyan

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన కార్యకర్త వసంతరాయలు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. పవన్‌తో పాటు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్.. వసంతరాయలు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

‘జులైలో వసంతరాయలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కుటుంబసభ్యులు వసంతరాయలు అవయవాలను దానం చేసి ఐదుగురికి కొత్త జీవితం ఇచ్చారు. అంత బాధలోనూ కుటుంబ సభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నందుకు నా ధన్యవాదాలు. నేను స్వయంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పేందుకు వచ్చాను. వారి కుటుంబానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అండగా నిలబడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా వారికి చేయూతను ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాను. వసంతరాయలు బిడ్డకు వినికిడి లోపం ఉన్నందున ఆపరేషన్ ఉచితంగా చేయించేలా చర్యలు తీసుకుంటాం. టీటీడీ ద్వారా ఆస్పత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేస్తాం. నా రాక సందర్భంగా స్వాగతం పలికిన కూటమి నేతలందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

Updated Date - Jan 21 , 2026 | 07:16 PM