స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్: గవర్నర్ జిష్ణుదేవ్
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:29 PM
ఆటలు కేవలం మెడల్స్ కోసమే కాదని, దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ ఒక శక్తిమంతమైన మార్గమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్రీడలు ప్రజలకు ఎన్నో నేర్పుతాయన్నారు.
హైదరాబాద్, జనవరి 22: ప్రధాని నరేంద్ర మోదీ.. దేశాన్ని స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా మార్చాలని విజన్‌గా పెట్టుకున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) అన్నారు. గురువారం సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడారు గవర్నర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటలు కేవలం మెడల్స్ కోసమే కాదని.. దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ ఒక శక్తిమంతమైన మార్గమని గవర్నర్ వివరించారు. స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందని, యోగాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లినట్లు తెలిపారాయన.
ప్రధాని మోదీ పాలసీలను ప్రజా ఉద్యమాలుగా మార్చడంలో ఆయన నాయకత్వ సామర్థ్యం అద్భుతమైనదని కొనియాడారు జిష్ణుదేవ్ వర్మ. ఈశాన్య రాష్ట్రాల నుంచి అన్ని మెడల్స్ వస్తాయని ఊహించలేదని, త్రిపుర నుంచి ఒలింపిక్స్‌కు పోటీ పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ మంత్రి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు ఇంత స్థాయిలో పాల్గొనడం సంతోషకరమని గవర్నర్ అభివర్ణించారు. క్రీడలు ప్రజలకు ఎన్నో నేర్పుతాయన్నారు. ఇది వికసిత్ భారత్ కోసం వేసే ముందడుగు అని.. 'స్వస్థ్ భారత్, శ్రేష్ఠ భారత్'కు ఇది తొలి అడుగు అని గవర్నర్ ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి...
కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..
Read Latest Telangana News And Telugu News