Share News

మీడియా సంస్థలపై వైసీపీ నేతల బెదిరింపు ధోరణి సరికాదు: రామచందర్ రావు

ABN , Publish Date - Apr 07 , 2026 | 07:03 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద వైసీపీ నేతల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు.

మీడియా సంస్థలపై వైసీపీ నేతల బెదిరింపు ధోరణి సరికాదు: రామచందర్ రావు
Ramachander Rao

హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) సంస్థల మీద వైసీపీ నేతలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు. ఈరోజు(మంగళవారం) ఆయన ఏబీఎన్‌తో మాట్లాడారు. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇదే తరహా దాడులు చేసేవారని ప్రస్తావించారు. రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని.. బెదిరింపు ధోరణి సరికాదన్నారు. బాధ్యతాయుతమైన ఏబీఎన్ లాంటి సంస్థపై వైసీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తున్నామని రామచందర్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 07:05 PM