ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:39 AM
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆటో రిక్షా కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో... ‘ఆటోనగర్ కాలనీ’ పేరుతో గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఆటోనగర్ కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం :పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆటో రిక్షా కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో... ‘ఆటోనగర్ కాలనీ’ పేరుతో గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆటో కార్మికుల కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత కల్పించాలనే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్‌పల్లి/లక్ష్మీగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపారు.
ఒక్కో ప్రాంతంలో 500 ఫ్లాట్ల చొప్పున మొత్తం 2వేల ఫ్లాట్లను నిర్మించనున్నామని, ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.220 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు. ఈ పథకం ప్రత్యేకంగా ఆటో రిక్షా కార్మికుల కోసమే రూపొందించామని, ఇళ్ల కేటాయింపు, ఆర్థిక సహాయం, అర్హత ప్రమాణాలు తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు- టవర్స్ పథకం నిబంధనలే వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను పరిశీలించి, సమగ్ర ప్రాజెక్టు నివేదదిక (డీపీఆర్) రూపొందించడంతో పాటు ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని హౌసింగ్ బోర్డు అఽధికారులను మంత్రి ఆదేశించారని ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News