23 ఏళ్ల భూ వివాదానికి తెర.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో విజయం
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:28 PM
మియాపూర్ భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చరిత్రాత్మక విజయం వరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నంబర్లు - 100, 101లోని భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మియాపూర్ భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చరిత్రాత్మక విజయం వరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నంబర్లు - 100, 101లోని భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 550 ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. ఈ వివాదాస్పద భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
1912 నాటి సర్వే రికార్డుల ప్రకారమే ఈ భూములు 'సర్కారీ పోరంబోకు' కిందకు వస్తాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. 2003 నాటి ఉమ్మడి హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వ భూములను కైవసం చేసుకునేందుకు జరిగిన ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు చెల్లవని స్పష్టం చేసింది. సరైన పర్యవేక్షణ లేక గత 23 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంచలనాత్మక భూవివాదానికి తెరపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News