Share News

డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీ, మెమరీ కార్డుల్లో కీలక ఆధారాలు.. ఏసీబీ దర్యాప్తు వేగం

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:20 PM

డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీ, మెమరీ కార్డుల్లో కీలక ఆధారాలు.. ఏసీబీ దర్యాప్తు వేగం
DSP Bheem Reddy

హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): డీఎస్పీ భీమ్‌రెడ్డి (DSP Bheem Reddy) రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.300 కోట్లపైన ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉంటున్న విల్లా ఎలా కొన్నారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. మెమరీ కార్డులు, డైరీల ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. మెమరీ కార్డులోని వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.


‘నాకు ఇవ్వాల్సిన వాళ్లు, నేను ఇవ్వాల్సినవి’ అంటూ డీఎస్పీ భీమ్‌రెడ్డి తన డైరీలో రాసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీలు ఎప్పుడైనా తిరగబడే ప్రమాదం ఉందని ఆయన ముందే ఊహించాడని అన్నారు. అక్రమాస్తులు కూడపెట్టడంలో భీమ్‌రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆస్తులను బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. బినామీల దగ్గర నుంచి క్యాన్సిలేషన్ డీడ్‌లను ముందే రాయించుకున్నాడని ఏసీబీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 06:10 PM