Share News

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:39 AM

ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు విషయంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌కు అనుకూలంగా హైకోర్టులో నిర్ణయం వెలువడిందని ఆ సంఘం అధ్యక్షుడు ఈదురు వెంకన్న తెలిపారు.

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు హైకోర్టులో ఊరట

  • నాలుగు రీజియన్లలో ఇతర సంఘాలకు గుర్తింపుపై స్టే

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు విషయంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌కు అనుకూలంగా హైకోర్టులో నిర్ణయం వెలువడిందని ఆ సంఘం అధ్యక్షుడు ఈదురు వెంకన్న తెలిపారు. నల్లగొండ, వరంగల్‌, మెదక్‌, సికింద్రాబాద్‌ రీజియన్లలో క్లాజ్‌-6 కింద ఇతర కార్మిక సంఘాలకు కల్పించిన గుర్తింపుపై స్టే విధించిందని తెలిపారు.


కార్మిక సంఘాల ఎన్నికల్లో క్లాజ్‌-6 కింద గుర్తింపు కోసం అవసరమైన 50 శాతం ఓట్లు రాకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్థంగా ఆ నాలుగు రీజియన్లలో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, టీఎంయూ సంఘాలకు అధికారులు గుర్తింపు ఇచ్చారని ఆరోపించారు. దీనిని సవాలు చేస్తూ తాము హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 05:39 AM