Share News

కృష్ణా జలాల విడుదలపై కర్ణాటక సీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:11 PM

కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు కర్ణాటక సీఎం శివకుమార్ సానుకూలంగా స్పందించారు.

కృష్ణా జలాల విడుదలపై కర్ణాటక సీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్

హైదరాబాద్, సెప్టెంబర్ 23: కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు కర్ణాటక సీఎం శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రతిస్పందించారు. తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


కృష్ణా జలాలను తెలంగాణకు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తిని అంగీకరించినందుకు ఆయనకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని చాటేలా కృష్ణా జలాల విడుదల నిర్ణయం తీసుకున్నారంటూ కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్

సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 03:24 PM