Share News

కాంగ్రెస్‌పై బిగిసిన రేవంత్‌ పట్టు

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:28 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత పట్టు బిగించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రేవంత్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ స్థానంలో బీఎం సందీ్‌పను నియమించడం ఇందుకు సూచిక అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌పై బిగిసిన రేవంత్‌ పట్టు

  • సీఎం అభీష్టం మేరకే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మార్పు!

న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత పట్టు బిగించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రేవంత్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ స్థానంలో బీఎం సందీ్‌పను నియమించడం ఇందుకు సూచిక అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇన్‌చార్జిగా ఉన్నవారు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో, విధాన వ్యవహారాల్లో రోజువారీ జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి చెప్పారని, తనతో కలిసి పనిచేసే వారిని ఇన్‌చార్జిగా నియమించాల్సిందిగా కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఆమె రాహుల్‌గాంధీకి చెప్పడంతో బీఎం సందీప్‌ నియామకానికి మార్గం సుగమమైందని పేర్కొన్నాయి.


బీఎం సందీప్‌ ఇప్పటివరకు మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శుల కింద పనిచేస్తున్నారని, నేరుగా ఒక రాష్ట్ర వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన దాఖలాలు లేవని ఈ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన అందరితో కలిసి పనిచేసే వ్యక్తి అని చెబుతున్నారు. రేవంత్‌కు సహకరించే వ్యక్తిని నియమించాల్సిందిగా రాహుల్‌గాంధీ చెప్పడంతో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తనకు సన్నిహితుడైన సందీప్‌ను తెలంగాణకు పంపారని తెలిసింది. దీంతో రేవంత్‌కు పార్టీ పరంగా సమీప భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చునని, అన్నీ ఆయన అనుకున్న విధంగా సాగుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలో ఓట్‌ చోరీకి వ్యతిరే కంగా తెలంగాణ నుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించిన రేవంత్‌రెడ్డి.. తాజాగా భారత్‌ సమ్మిట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించడం ద్వారా పార్టీ హైకమాండ్‌ దృష్టిలో తన ప్రతిష్ఠను పెంచుకున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌గాంధీ భారత్‌ సమ్మిట్‌లో పాల్గొని తిరిగి ఢిల్లీకి చేరుకున్న రోజే సందీప్‌ను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:28 AM