టార్గెట్ హరీశ్ రావు..!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:10 AM
సిద్దిపేట.. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు పెట్టని కోట! పార్టీ అధినేత కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ప్రాతినిధ్యం. అయినా రెండు దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికలోనూ ఆయనకు విజయాన్ని కట్టబెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కోటను, ఆ కోటకు ప్రతినిధి అయిన హరీశ్‌రావునుటార్గెట్ చేశారు.
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం
హరీశ్ ఆస్తుల చిట్టాను సీఎం బయట పెడతారంటున్న కాంగ్రెస్ వర్గాలు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట.. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు పెట్టని కోట! పార్టీ అధినేత కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ప్రాతినిధ్యం. అయినా రెండు దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికలోనూ ఆయనకు విజయాన్ని కట్టబెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కోటను, ఆ కోటకు ప్రతినిధి అయిన హరీశ్‌రావునుటార్గెట్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు.
అలాగే జిల్లాలో రూ.541.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే భారీ ర్యాలీలో, బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రులు పర్యటించడం సాధారణ విషయమే అయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో.. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్‌రావే పార్టీకి అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరినీ టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తొలుత కేటీఆర్‌ను ఎంచుకున్నారు. గత నెలలో కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పర్యటించి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్‌కు విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయని, ఆయన కుటుంబానికి స్టార్ హోటళ్లలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదే తీరులో సిద్దిపేట సభలోనూ హరీశ్ అక్రమ ఆస్తుల చిట్టాను సీఎం రేవంత్‌రెడ్డి బయటపెడ తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేయవచ్చని అంటున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
సిద్దిపేట పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ పర్యటనలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.200కోట్ల చొప్పున వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.13.50కోట్లతో 6 తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. సిద్దిపేట జిల్లాలో రూ.54.67కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభిస్తారు. కొమురవెల్లి ఆలయంలో రూ.14.35కోట్లతో నిర్మించిన వసతి సత్రాన్ని, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. రూ.6.50కోట్లతో నిర్మించిన 53గ్రామ మహిళా సంఘాల భవనాలను, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News