హైదరాబాద్‌లో భారీ రేషన్ బియ్యం స్కాం.. పాలిష్ చేసి బ్రాండెడ్ పేర్లతో విక్రయాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:17 PM
హైదరాబాద్‌లో భారీ రేషన్ బియ్యం స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియా గుట్టు బయటపడింది.
హైదరాబాద్, అక్టోబర్ 29: భాగ్యనగరంలో భారీ రేషన్ బియ్యం స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియా గుట్టు బయటపడింది. హైదరాబాద్‌లో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పాలిష్ చేసిన బియ్యానికి కార్పొరేట్ బ్రాండింగ్ ఇస్తూ అధిక ధరలకు బియ్యాన్ని అమ్ముతున్న ముఠాను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో రేషన్ బియ్యాన్ని రూ.80 నుంచి రూ.100 అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
పలు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో సన్న బియ్యాన్ని ఈ మాఫియా అమ్మేస్తున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లోని రైస్ డిపోలపై సివిల్ సప్లై శాఖ, విజిలెన్స్ అధికారులు టిమ్స్ ఆపరేషన్ నిర్వహించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువగా ధరకు కొనుగోలు చేసి.. సన్న బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తనిఖీలో వెల్లడైంది. దీంతో పలు రైస్ దుకాణాలలో శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అయితే కర్మన్‌ఘాట్‌లో సివిల్ సప్లైస్ అధికారుల రాకతో పలువురు వ్యాపారులు షాపులను బంద్ చేసుకొని పరార్ అయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
బియ్యం బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు.. ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం: స్టీఫెన్ రవీంద్ర
Read Latest Telangana News And Telugu News