Share News

సముద్రంలో చిక్కుకున్న వాణిజ్య నౌక.. 13 మంది సురక్షితం, మరో ఏడుగురి కోసం రెస్క్యూ

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:24 PM

బంగాళాఖాతంలో ఆర్నాబ్ తుఫాన్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ వాణిజ్య నౌక అంతర్వేది సమీపంలోని సముద్రంలో చిక్కుకుంది. నౌకలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది.

సముద్రంలో చిక్కుకున్న వాణిజ్య నౌక.. 13 మంది సురక్షితం, మరో ఏడుగురి కోసం రెస్క్యూ
Antarvedi Ship Rescue Operation

పశ్చిమ గోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఆర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాన్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ వాణిజ్య నౌక అంతర్వేది సమీపంలోని సముద్రంలో చిక్కుకుంది. విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఈ నౌక ప్రతికూల సముద్ర పరిస్థితుల కారణంగా ముందుకు సాగలేక నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది.


హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, సముద్రంలో ఉన్న కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 13 మందిని సురక్షితంగా రక్షించి, ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక సుజయ్ (SUJAY)లోకి తరలించారు. మరో ఏడుగురు ఇంకా వాణిజ్య నౌకలోనే ఉండగా.. వారినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. నౌకలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురినీ సురక్షితంగా రక్షించడమే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మిగిలిన సిబ్బంది రక్షణపై ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు: మంత్రి నారాయణ

Updated Date - Oct 29 , 2026 | 03:26 PM