Share News

బియ్యం బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు.. ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం: స్టీఫెన్ రవీంద్ర

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:55 PM

బియ్యం బ్లాక్ మార్కెట్ చేసేవారికి సివిల్ సఫ్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బియ్యం స్మగ్లింగ్ చేసేవారిపై బైండోవర్ కేసులు బుక్ చేస్తున్నామని తెలిపారు.

బియ్యం బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు.. ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం: స్టీఫెన్ రవీంద్ర
Stephen Ravindra

హైదరాబాద్, అక్టోబర్ 29: బియ్యం బ్లాక్ మార్కెట్ చేసేవారికి సివిల్ సఫ్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బియ్యం స్మగ్లింగ్ చేసేవారిపై బైండోవర్ కేసులు బుక్ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు (గురువారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో బియ్యం ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బియ్యం అక్రమ అమ్మకాలపై సమాచారంతో రైడ్స్ నిర్వహిస్తున్నామన్నారు. విజిలెన్స్ అధికారులతో కలిసి హైదరాబాద్‌తో పాటు వివిధ చోట్ల తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రైస్ ఇల్లీగల్ బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


స్టాక్‌కు మించి బియ్యం నిల్వ చేస్తే కేసులు పెడతామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రైస్ మిల్లర్స్, హోల్ సేలర్స్, రీటైలర్స్‌ను పిలిచి బియ్యం ధరలు తగ్గించాలని చెప్తున్నామని అన్నారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న దానిపై స్టడీ చేస్తున్నామని.. బియ్యం ధరలు తగ్గించని వారిపై కేసులు తప్పవని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు బియ్యం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. 28 ఎల్‌ఎమ్‌టీ స్టాక్స్‌ ఉన్నాయని తెలిపారు. 25 కేజీలకు బదులు 23, 24 కేజీల రైస్ బ్యాగ్‌లను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని.. అలాంటి వారి ట్రేడ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని సివిల్ సఫ్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పొత్తు ధర్మం పాటించాల్సిందే.. రెబల్స్‌ను సస్పెండ్ చేయండి: సీఎం చంద్రబాబు

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 03:56 PM