Share News

నల్లగొండ జిల్లాలో గన్ ఫైర్.. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌పై కేసు

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:17 PM

నల్లగొండ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో శమీపూజ సమయంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ చింతల సోమయ్య గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.

నల్లగొండ జిల్లాలో గన్ ఫైర్.. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌పై కేసు
Nalgonda Firing Case

నల్లగొండ, అక్టోబర్ 29: దసరా పండుగ సందర్భంగా శమీపూజ నిర్వహిస్తుండగా గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ చింతల సోమయ్య మూడు రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల ఘటనపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. పండుగ సందర్భంగా శమీపూజ నిర్వహించే సమయంలో తుపాకీతో కాల్పులు జరిపినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.


ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ చింతల సోమయ్య గ్రామస్తులతో పాటు పలువురిని తుపాకీ చూపించి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయని సమాచారం. ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు, కాల్పుల ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 29 , 2026 | 02:15 PM