కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: కొండా సురేఖ
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:29 PM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 29: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన అంశంపై ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. కేటీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. విపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. అయితే.. ఆ సందర్భంలో కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామంపై స్పందిస్తూ తన వైఖరిని వెల్లడించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యక్తిగత దురుద్దేశం లేదని పేర్కొన్నారు.
కేటీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ.. వారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలని గానీ తనకు ఎలాంటి ఉద్దేశం లేదని కొండా సురేఖ తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల వారు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విపక్షంపై విమర్శలు చేసే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆమె చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News