హైదరాబాద్‌కు రాహుల్!
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:15 AM
హెచ్‌ఐసీసీలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న భారత్ సమ్మిట్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఒక రోజు వచ్చే చాన్స్
‘భారత్ సమ్మిట్’లో పాల్గొనేందుకే..!
హైదరాబాద్/ కందుకూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐసీసీలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న భారత్ సమ్మిట్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సదస్సు జరిగే మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఆయన హాజరై కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో జరగనున్న ఈ సదస్సుకు వంద దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ప్రతినిధుల్లో పారిశ్రామిక వేత్తలతో పాటుగా పలు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్థికాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాలు, గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ అనే అంశాలపైన ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
‘గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను పరిశీలించిన ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి ఆదేశించారు. శుక్రవారం ఫ్యూచర్‌సిటీ అథారిటీ కమిషనర్ శశాంకతో కలిసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట రెవెన్యూ పరిధిలోని స్కిల్ యూనివర్సిటీ, రేడియల్ రోడ్డు పనులు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. సమ్మిట్ ప్రాంగణంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News