Share News

చిన్నప్పుడు నాపై లైంగిక దాడి

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:31 AM

సంచలనం సృష్టించిన పవన్‌కుమార్‌ హనీట్రాప్‌ కేసులో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

చిన్నప్పుడు నాపై లైంగిక దాడి
Hyderabad Honey Trap Case

  • స్వలింగ సంపర్క బాధితుణ్ని..

  • దానికి బానిసగా మారా

  • ఈజీ మనీ కోసమే సోషల్‌ మీడియాలో హనీ ట్రాప్‌

  • పోలీసు విచారణలో వెల్లడించిన పవన్‌కుమార్‌

  • అతడి బాధితుల్లో ఇద్దరు డీసీపీలు, ఎసీపీ, ఇన్‌స్పెక్టర్లు

హైదరాబాద్‌ సిటీ, సైదాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన పవన్‌కుమార్‌ హనీట్రాప్‌ కేసులో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి వలపు వలకు చిక్కినవారిలో ఇద్దరు డీసీపీలు, ఏసీపీ, పలువురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పవన్‌కుమార్‌ను మూడు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారించారు. బుధవారంతో పోలీస్‌ కస్టడీ ముగియడంతో గురువారం అతణ్ని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు తెలిపారు. కాగా.. నిందితుడు తాను చేసిన లీలల గురించి అడగకముందే వరుసపెట్టి చెబుతుండటంతో విచారణాధికారులే విస్తుపోయినట్టు సమాచారం. చిన్నతనంలో కొందరు తనపై బలవంతంగా స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారని.. దాంతో తాను దానికి బానిసగా మారానని పవన్‌కుమార్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.


తొలుత గే యాప్‌లో తన పేరు నమోదు చేసుకొని పరిచయాలు పెంచుకున్న అతడు.. సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశ పెరగడంతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి పలువురికి వలపు వల విసిరి బాధితులను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. వారి బలహీనతలను అడ్డుపెట్టుకొని అతడు రూ.25 లక్షలదాకా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్‌కుమార్‌ బాధితులైన ఇద్దరు డీసీపీలు, ఏసీపీ, పలువురు ఇన్‌స్పెక్టర్లు, జైలు అధికారుల్లో ఒకరిద్దరు మాత్రమే ఇక్కడివారని.. మిగతావారు నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధికి సంబంధించిన వారు కాదని సమాచారం. వారి వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా.. పవన్‌ హనీట్రాప్‌ కాంటాక్ట్‌ లిస్టులో 1000 మందికిపైగా ఉన్నప్పటికీ 82 మంది మాత్రమే అతడికి డబ్బులిచ్చారని విచారణలో తేలినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:31 AM