పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు ఆపండి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:22 AM
నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ నేతల వినతి
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు కృష్ణా జలాల వినియోగం, తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ నాయకులు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ బిశ్వా్‌సను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కృష్ణా జలాల వినియోగం, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు నిర్మాణాలపై పారదర్శకత ఉండాలని చెప్పారు. తెలంగాణ నీటి వాటాకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోర్డు చైర్మన్‌ను కలిసిన అనంతరం సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ నుంచి పల్నాడు ప్రాంతానికి నీటిని తరలించేందుకు ఏపీ చేపడుతున్న పనులకు అనుమతులు, నీటి కేటాయింపులు లేవని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేఆర్ఎంబీపై ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News