ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోతోంది
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:28 AM
కేంద్ర ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను క్రమంగా కోల్పోతోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఒకప్పుడు ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందిన ఈ వ్యవస్థ, ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతోందని పేర్కొన్నారు.
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది:సీపీఐ
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను క్రమంగా కోల్పోతోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఒకప్పుడు ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందిన ఈ వ్యవస్థ, ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతోందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నమోదు, తొలగింపు ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గడిచిన పది నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. వాటిని పట్టించుకోకుండా సీఈసీ జ్ఙానే్‌షకుమార్ నిర్ణయాలు తీసుకున్నారంటూ వచ్చిన ఒక పత్రికా కథనాన్ని ఓవైసీ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ‘‘సర్ పేరుతో పేద వర్గాలను ఎన్నికల సంఘం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజాస్వామ్యానికి కాపలాగా ఉండాల్సిన వ్యవస్థలే ప్రశ్నార్థకంగా మారాయి’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీలకు అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తోందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం, ఓట్లను తొలగించే పనిలో నిమగ్నమైందని రామకృష్ణ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు మంత్రులు వెళ్లిన హెలికాప్టర్‌కు ఇంధన సమస్య!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News