డోర్ డెలివరీ@‘మీ-సేవ’
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:35 AM
మీ-సేవ’ సర్వీసులను నేరుగా ఇంటి ముంగిట్లోనే అందించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
తొలుత పైలట్ ప్రాజెక్టుగా ‘క్యూర్’లో అమలు
8 ‘మీ@సేవ డోర్ డెలివరీ సర్వీసెస్’ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్/ రాంనగర్, సెప్టెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): ‘మీ-సేవ’ సర్వీసులను నేరుగా ఇంటి ముంగిట్లోనే అందించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ‘మీ-సేవ’ ప్రారంభమై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్‌బాబు.. ఇంటి వద్దకే మీ-సేవను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ‘క్యూర్’ పరిధిలో ఇంటి వద్దకే ‘మీ-సేవ’ సర్వీసులందిస్తున్నామని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
ఈ సేవలు పొందాలనుకున్న వారు 1100 అనే టోల్ ఫ్రీ నంబర్‌తో/ మీ-సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయం, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, పోలీసుశాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర ‘మీ-సేవ’లను మీ ఇంటి వద్దే అందిస్తామన్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్న శ్రీధర్‌బాబు.. పౌరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ముందు మీ-సేవ కేంద్రంలో భూముల పహణీలను తీసుకోవచ్చునన్నారు. మీ-సేవ కేంద్రాల నిర్వాహకుల కమీషన్ పెంపు అంశాన్ని ప్రభుత్వం సానుకూల పరిశీలిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐటీఈఅండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మీ-సేవ కమిషనర్ రవి కిరణ్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణ రెడ్డి, మీ-సేవ తెలంగాణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మొహిద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్ భారతీయులందరికీ ఆదర్శం
ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News