ఒయాసిస్ ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం.. డైరెక్టర్ మేఘన అరెస్ట్
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:12 AM
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ మేఘనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 28: ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ మేఘనను అదుపులోకి తీసుకున్నారు. మేఘనతో పాటు ఆమె తల్లిదండ్రులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఫెర్టిలిటీ సెంటర్‌లో మహిళల అండాల సేకరణలో మేఘన కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒయాసిస్ ఛైర్మన్ సూర్యకిరణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూర్యకిరణ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను మల్కాజ్‌గిరి పోలీసులు అప్రమత్తం చేశారు. అయితే.. సూర్యకిరణ్ ఇప్పటికే దేశం దాటి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెండు రోజుల పాటు బేగంపేటలో ఒయాసిస్ హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసులో సోదాలు జరిపిన పోలీసులు.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్‌టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ సేలవు, డోనర్ల రికార్డులతో పాటు లాప్‌ట్యాప్‌లు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మహిళలను డోనర్లుగా సమకూర్చిన ఏజెంట్లు ఎవరు..వారి ద్వారా ఎంతమందిని రిక్రూట్ చేశారు.. డోనర్లకు చెల్లింపులు జరిగాయి, ఏజెంట్లకు అందిన కమీషన్లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులు, డిజిటల్ ఆధారాల ద్వారా ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలపై స్పష్టత తీసుకొచ్చేందుకు విచారణాధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్
Read Latest Telangana News And Telugu News