Share News

నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ సోదాలు.. టెండర్ల రికార్డుల పరిశీలన

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:18 PM

నిమ్స్ హాస్పిటల్లో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో రికార్డ్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ సోదాలు.. టెండర్ల రికార్డుల పరిశీలన
NIMS Hospital ACB Raids

హైదరాబాద్, నవంబర్ 17: నగరంలోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో రికార్డ్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు 10 మంది ఏసీబీ అధికారుల బృందం తనిఖీల్లో పాల్గొంది. గత నెల అక్టోబర్‌లో జరిగిన సోదాలకు అనుగుణంగా మరోసారి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మ్యాన్‌పవర్‌ రిక్రూట్‌మెంట్‌, సెక్యూరిటీ, క్యాంటీన్‌, స్టోర్స్‌, మెడికల్‌ షాపు టెండర్ల పత్రాలను పరిశీలించినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు అడిగిన డాక్యుమెంట్స్‌ను డాక్టర్లు అందించినట్టు తెలుస్తోంది.


ఈ ఏడాదిలో వరుసగా నాలుగోసారి నిమ్స్ ఆస్పత్రిలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గత నెల నిమ్స్‌లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. క్యాంటీన్, మెడికల్ స్టోర్లు, సర్జికల్ స్టోర్లలో సోదాలు చేశారు. లంచాల వ్యవహారానికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. 2014 నుంచి నిమ్స్ హాస్పిటల్లో జరిగిన అక్రమార్కుల దందాపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తోంది.


లక్ష్మీ భాస్కర్‌కు బెయిల్

నిమ్స్‌లో నిధుల అవకతవకలు, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. భాస్కర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ప్రతి మంగళవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రూ.25 వేల నగదు, రెండు పూచీకత్తులు సమర్పించాలని లక్ష్మీ భాస్కర్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం.. రేవంత్ లెక్కలు తప్పంటూ కవిత విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 03:29 PM