Share News

కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ఎంపీ అర్వింద్

ABN , Publish Date - May 02 , 2026 | 03:36 PM

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చేసిందేమీ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ శ్రద్ధ అంటూ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ఎంపీ అర్వింద్
Dharmapuri Arvind

హైదరాబాద్, మే 2: కాంగ్రెస్ నేతలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగడానికి కారణం తెలియక రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎంపీ మాట్లాడుతూ.. చెప్పులు, దుస్తులు సరిగా వేసుకోవడానికి రాని వ్యక్తి దేశంలో ప్రధాన విపక్ష పార్టీ లీడర్ అనుకోవడానికి సిగ్గుగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చేసిందేమీ లేదని విమర్శించారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్‌కు శ్రద్ధ అంటూ వ్యాఖ్యానించారు.


ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కేసీఆర్ కోవర్ట్ అని ఎంపీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సివిల్ సప్లై శాఖలోనే అత్యంత అవినీతి జరుగుతోందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ కోవర్ట్‌లనే ఉద్యోగులుగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కంటే భారీ అవినీతి.. ఉత్తమ్ శాఖలో జరుగుతోందని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్‌ ప్రొఫైల్స్ తొలగింపు

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2026 | 03:44 PM