కార్మికులకు అపార అవకాశాలు.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి వాసంశెట్టి సుభాశ్
ABN , Publish Date - May 02 , 2026 | 01:22 PM
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు.. అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణా కేంద్రాలుగానూ మారతాయని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
అమరావతి, మే 2: ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కార్మికుడిలా శ్రమిస్తూ కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి శుభాశ్(Minister Vasamsetti Subhash) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు.. అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణా కేంద్రాలుగానూ మారతాయన్నారు. అమరావతి, పోలవరం సహా వివిధ పెట్టుబడుల నిర్మాణాలకు సంబంధించి కార్మికులకు అపార అవకాశాలు రాష్ట్రంలోనే ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని మంత్రి విమర్శించారు. ఇసుకను బంగారం చేసి, ఒక ఇటుక కూడా పేర్చక పోగా కార్మికుల భద్రత విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రజలే తన యజమానులు అంటూ రోజుకు 18 గంటల పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిరంతర శ్రామికుల్లా పని చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ లిక్కర్ స్కామ్.. రంగంలోకి ఐటీ.. రూ.2000 కోట్లపై ఫోకస్
సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపై ప్రముఖుల సంతాపం
Read Latest AP News And Telugu News