సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్ ప్రొఫైల్స్ తొలగింపు
ABN , Publish Date - May 02 , 2026 | 12:00 PM
అమాయకులను టార్గెట్ చేసి వారిని బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల వైపు మళ్లించే ప్రొఫైల్స్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్, 1,903 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్లను గుర్తించి తొలగించారు.
హైదరాబాద్, మే 2: ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ పెట్టుబడి స్కామ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏప్రిల్ నెలలోనే 184 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తొలగించగా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 801 ఫేక్ యాడ్స్‌ను గుర్తించారు. అమాయకులను టార్గెట్ చేసి వారిని బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల వైపు మళ్లించే ప్రొఫైల్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎల్ పేరుతో అక్రమ బెట్టింగ్‌ను ప్రోత్సహించే ఈ ప్రొఫైల్స్ ద్వారా యువతను ఆకర్షించి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిరంతర సైబర్ పెట్రోలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను, 1,903 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్లను గుర్తించి తొలగించారు. ఈ ప్రొఫైల్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అక్రమ డబ్బు మార్గాలపై దృష్టి సారించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
నేడు పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు
కోడెల శివప్రసాదరావు జయంతి.. సీఎం, లోకేశ్ నివాళులు
Read Latest Telangana News And Telugu News