Share News

కోడెల శివప్రసాదరావు జయంతి.. సీఎం, లోకేశ్ నివాళులు

ABN , Publish Date - May 02 , 2026 | 10:32 AM

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. పల్నాడు అభివృద్ధి కోసం కోడెల ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.

కోడెల శివప్రసాదరావు జయంతి.. సీఎం, లోకేశ్ నివాళులు
CM Chandrababu

అమరావతి, మే 2: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పేదలకు రూపాయి వైద్యుడిగా కోడెల సేవలందించారని గుర్తు చేశారు. సంఘ విద్రోహ శక్తులు, ఫ్యాక్షనిస్టులకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారన్నారు. పల్నాడు అభివృద్ధికి కృషి చేసిన దూరదృష్టి ఉన్న నాయకుడు కోడెల శివప్రసాదరావు అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు.


పల్నాడు అభివృద్ధికి కోడెల ఎనలేని కృషి: మంత్రి లోకేశ్

‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొడాలి శివప్రసాద్ రావు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ‘రూపాయి డాక్టర్’గా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా పల్నాడు అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. పల్నాడు టైగర్‌గా ప్రసిద్ధి చెందిన కొడాలి శివప్రసాద్ రావు జయంతి సందర్భంగా పార్టీకి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

నేను ఎమ్మెల్సీని.. తెలుసా?

నేడు పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2026 | 11:01 AM