హైదరాబాద్‌లోని మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న లారీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:09 AM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. యూటర్న్ తీసుకుంటుండగా.. బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొనడంతో 29 ఏళ్ల యువకుడు మృతి చెందారు.
హైదరాబాద్, అక్టోబర్ 9: నగరంలోని మియాపూర్ మెట్రో సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.
పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. విష్ణు(29) అనే వ్యక్తి కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌కు తన ద్విచక్రవాహనం మీద వెళ్తున్నారు. మియాపూర్ వద్దకు రాగానే మెట్రో పిల్లర్ నెంబర్ 600 సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా.. అటుగా వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు, స్థానికులు బాధితుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ.. ఆసుపత్రిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విష్ణు భార్య పూజ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News