పేదలను దోచుకుంది బీఆర్ఎస్సే
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:28 AM
తొమ్మిదిన్నరేళ్లు రాజ్యాన్ని ఏలి పేదోళ్ల కష్టాలు పట్టించుకోకుండా... ప్రజాధనాన్ని లూటీ చేసింది, ప్రజలను పేదవాళ్లని చేసింది నాటి దొరలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
వరి వేస్తే ఉరే అన్నది నాటి సర్కారే..
ప్రజా ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తోంది
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఖమ్మం రూరల్, బచ్చన్నపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదిన్నరేళ్లు రాజ్యాన్ని ఏలి పేదోళ్ల కష్టాలు పట్టించుకోకుండా... ప్రజాధనాన్ని లూటీ చేసింది, ప్రజలను పేదవాళ్లని చేసింది నాటి దొరలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 14, 15, 16 వార్డులు, తెల్దారుపల్లి గ్రామంలో రూ.3కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరే అనిఅందని, కానీ తమ ప్రజా ప్రభుత్వం వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తోందన్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం రాష్ట్ర సొత్తును కొల్లగొట్టారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతీ పేదింటికి సంక్షేమ ఫలాలను అందిస్తోందని, ఇప్పటికే 74 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో అర్హులైన పేదలకు 8లక్షల ఇళ్లను ఇచ్చామన్నారు.
120 ఏళ్ల క్రితం భూముల సర్వేలు జరిగాయని.. మళ్లీ ప్రజా ప్రభుత్వంలో భూముల సమగ్ర సర్వే చేసి అర్హులైన రైతులందరికీ భూధార్ కార్డులు అందజేస్తున్నామన్నారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో భూ సర్వే చేయాలని ఖమ్మం కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మ్యాపులతో కూడిన సర్వేతో భూధార్ కార్డులను ప్రతీ భూహక్కుదారుకు ఇస్తామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు రూ.40కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశామని, తెల్దారుపల్లి ప్రజల కోసం నాగార్జునసాగర్ కాల్వపై రూ.5కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రెవెన్యూ, హౌసింగ్, భూ సర్వే శాఖలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకునేందురు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. బుధవారం శామీర్‌పేటలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యమకారులకు అప్పులు - కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు
ఉద్యమకారుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం తమ పాలనలో... ప్రజలకు, ఉద్యమకారులకు చేసింది శూన్యమని పొంగులేటి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ పైవిధంగా స్పందించారు. ఒకప్పుడు ఎకరం భూమి కూడా లేని స్థితిలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం రూ.కోట్ల కొద్దీ అక్రమ సంపదను కూడబెట్టుకుంటూ, విలాసవంతమైన ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉద్యమకారుల జీవితాలు బాగుపడలేదంటూ... అప్పుల బాధ తట్టుకోలేక బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలిసి మనస్తాపం కలిగిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News