Share News

నచ్చినోళ్లకే పనులు.. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:27 AM

విద్యుత్‌ కనెక్షన్ల జారీ నుంచి అపార్ట్‌మెంట్లకు.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. డివిజన్‌ అధికారులను కలువనిదే ఫైళ్లు క్లియర్‌ కావడం లేదు.

నచ్చినోళ్లకే పనులు.. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు
tgspdcl, hyderabad

  • కూకట్‌పల్లి, జీడిమెట్ల డివిజన్లలో ‘విద్యుత్‌’ అక్రమాలు

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ కనెక్షన్ల జారీ నుంచి అపార్ట్‌మెంట్లకు.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. డివిజన్‌ అధికారులను కలువనిదే ఫైళ్లు క్లియర్‌ కావడం లేదు. మేడ్చల్‌ సర్కిల్‌లోని కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌ డివిజన్లలో కొంతమంది అధికారులు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లతో దోస్తీ కడుతూ నచ్చినోళ్లకు పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెక్షన్ల నుంచి డివిజన్‌ కార్యాలయాలకు చేరిన ఫైళ్లు క్లియర్‌ కావాలంటే డివిజన్‌ స్థాయి అధికారులకు అడిగినంత ఇస్తే తప్పా పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి.


కూకట్‌పల్లి, జీడిమెట్ల డివిజన్లలో 11 కేవీ ఎక్స్‌టెన్షన్‌, డిపాజిట్‌ వర్క్‌లు అప్పగించడంలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో డీఈ స్థాయిలో రూ.లక్ష వరకే ఉన్న ఎక్స్‌టెన్షన్‌ పనుల వ్యయ పరిధిని రూ.5 లక్షలకు, డిపాజిట్‌ వర్క్‌లు రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచడంతో తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే ఎక్కువ పనులు అప్పగిస్తున్నారనే విమర్శలున్నాయి. డివిజన్‌ కార్యాలయాలు అక్రమాలకు కేంద్రంగా మారుతున్న సర్కిల్‌ ఉన్నతాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


city7.2.jpgపలు సెక్షన్లలో కొంతమంది ఏఈలు సెక్షన్‌ కాంట్రాక్టర్లుగా తమకు సంబంధించిన వాళ్లనే పెట్టుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డివిజన్‌ స్థాయిలో విద్యుత్‌ నెట్‌వర్క్‌ పెంచేందుకు, ఫీడర్ల విభజన పనుల్లోను గోల్‌మాల్‌ చేస్తున్నారు. ఏడాది కాలంగా డివిజన్‌స్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి చెల్లించిన బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:27 AM