Share News

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం.. స్థానికుల అభ్యంతరం

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:25 PM

హైదరాబాద్‌లోని కూకట్‌‌పల్లి హౌసింగ్ బోర్డ్ భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వేలం వేస్తోంది. కాగా ప్రజా అవసరాల కోసం సేకరించిన భూమిని వేలం వేయడంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం.. స్థానికుల అభ్యంతరం
kukatpally housing board land auction

హైదరాబాద్, నవంబర్ 12: పేద ప్రజలకు గృహవసతి కల్పించాలనే ఉద్దేశంతో రైతుల నుంచి సేకరించిన భూముల్లో.. మిగిలిన భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డు వేలం వేస్తోంది. కాగా.. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని ఎలా వేలం వేస్తారంటూ స్థానికులు, బీఆర్ఎస్, బీజీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూముల వేలాన్ని భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ వేలంపాట ఈ రోజు (గురువారం) రాత్రి వరకు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.


కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డు వేలం వేస్తోంది. ఇప్పటికి 12 ఫ్లాట్లు వేలం కాగా.. రాత్రి వరకు వేలంపాట కొనసాగుతుందని అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో 15వ ఫేజ్‌లో 2,696 గజాల భూమి మినహాయించి అన్ని భూములను వేలంపాట ద్వారా విక్రయిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా.. హుడా లేఅవుట్ లేకుండానే భూముల విక్రయాలను నిర్వహిస్తున్నారని.. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ఎలా వేలం వేస్తారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వేలంపాటను భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:26 PM