ఎయిర్ పోర్ట్ మెట్రోను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్: కేటీఆర్
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:01 PM
తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగానే శంషాబాద్‌కు మెట్రో వచ్చి ఉండేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్‌పోర్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని గుర్తు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేసిందని మండిపడ్డారు. భూములు అమ్ముకోవాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ అని కుండబద్దలు కొట్టారు.
ఇళ్లు కూలగొట్టకుండా మూసీ అభివృద్ధి సాధ్యం కాదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లైనా కట్టారా? అని ప్రభుత్వంలోని నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలుస్తారు.. పెద్దోళ్ల ఇళ్లు కనబడటం లేదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలించారు. ఉన్న సిటీలో దోమల మందుకు దిక్కు లేదు కానీ ఫ్యూచర్ సిటీ అంటా అని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ కాదు.. అది ఫార్మా సిటీ అని తెలిపారు. సందదర్భం వస్తే గడ్డి కూడా గడ్డపార అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
For More TG News And Telugu News