Share News

గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:15 AM

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రెచ్చిపోయిన ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్ కొరడా ఝుళిపించింది. ఈ పది రోజుల్లో1,530 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుంది.

గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 27: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రెచ్చిపోయిన ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్ కొరడా ఝుళిపించింది. ఈ పది రోజుల్లో1,530 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుంది. సెప్టెంబర్ 14 వినాయక చవితి నుంచి 23వ తేదీ నవరాత్రులు ముగిసిన రోజు వరకు షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఖైరతాబాద్, బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన పందిళ్లతోపాటు నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని వేధించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.


724 మంది యువకులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారికి వార్నింగ్ ఇచ్చింది. ఇక మహిళలను తీవ్రంగా వేధించిన 48 మందికి కోర్టు శిక్ష విధించింది. వినాయకుడి నిమజ్జనం జరిగిన రోజు నగరంలో జరిగిన శోభాయాత్రతోపాటు హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు తదితర ప్రాంతాల్లో మహిళల భద్రతపై షీ టీమ్స్ ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈవ్‌టీజర్లను పట్టుకున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి కఠిన చర్యలు తప్పవని షీ టీమ్స్ వార్నింగ్ ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ ఎదుట హజరుకానున్న ఎమ్మెల్యే గాంధీ

బసిరెడ్డిపల్లి గోశాలలో ఆవులపై పెద్దపులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు

For More TG News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 10:36 AM