బసిరెడ్డిపల్లి గోశాలలో ఆవులపై పెద్దపులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 08:14 AM
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది. స్థానిక కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలో గోశాలలోని గోవులపై పులి దాడి చేసిందని నిర్వాహకులు తెలిపారు.
వికారాబాద్, సెప్టెంబర్ 27: వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది. స్థానిక కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలో గోశాలలోని గోవులపై పులి దాడి చేసిందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఓ లేగదూడను పెద్దపులి ఎత్తుకెళ్లిందని చెప్పారు. తాజాగా మరో ఆవుపై పులి దాడి చేసిందని.. ఆ విషయాన్ని గమనించిన గో సంరక్షకుడు గట్టిగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో అక్కడి నుంచి పెద్దపులి పారిపోయిందని వివరించారు.
ఈ దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయని.. ఆవు వీపుపై పులి పంజా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని నిర్వాహకులు వివరించారు. ఈ దాడిలో ఆ ఆవు మృతి చెందిందని పేర్కొన్నారు. పెద్దపుల్లి సంచారంపై పోలీసులు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీంతో గోశాల పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోని సీసీటీవీ కెమెరాలను వారు పరిశీలించారని వివరించారు. గోశాలలో పులి దాడి ఘటనలు అందులో రికార్డు అయిందని తెలిపారు.
గోశాలలో దాదాపు 200 వరకు ఆవులుంటాయని నిర్వాహకులు కృష్ణస్వామి వెల్లడించారు. పులిని బంధించి అడవిలో వదిలి గోశాలను రక్షించాలని ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులతోపాటు పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నల్గొండలో నగదు విషయంలో కూలీల ఘర్షణ.. ఒకరి దారుణ హత్య
మన్మోహన్ ఫెలోషిప్ రెండో బ్యాచ్ ఎంపిక షురూ
For More TG News And Telugu News