Share News

నల్గొండలో నగదు విషయంలో కూలీల ఘర్షణ.. ఒకరి దారుణ హత్య

ABN , Publish Date - Sep 27 , 2026 | 07:06 AM

నగదు విషయంలో కూలీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్డు నంబర్ 6లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

నల్గొండలో నగదు విషయంలో కూలీల ఘర్షణ.. ఒకరి దారుణ హత్య

నల్లగొండ, సెప్టెంబర్ 27: నగదు విషయంలో కూలీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్డు నంబర్ 6లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ నాలుగో ఫ్లోర్‌లోని 402 రూమ్‌లో ఈ హత్య జరిగింది. ఈ హత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలగొండలో నూతనంగా చైన్నై షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారు. ఆ భవన నిర్మాణ పనుల కోసం తమిళనాడులోని చెన్నై నుంచి కూలీలను నల్గొండకు తీసుకొచ్చారు. వారంతా మీర్‌‌బాగ్ కాలనీలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. గత అర్ధరాత్రి నగదు విషయంలో కూలీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్రమైంది. దీంతో ఒకరిపై దాడి చేశారు. దీంతో ఆ కూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ సందర్భంగా పలువురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాంచందర్‌రావుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ

మన్మోహన్‌ ఫెలోషిప్‌ రెండో బ్యాచ్‌ ఎంపిక షురూ

For More TG News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 07:10 AM